"ఇక్కడ నీకోసమేమీ లేదు
రొండు రొట్టెలు తెచ్చుకో ఆకలేస్తే
కొన్ని కట్టెలు తెచ్చుకో నీకు చితి పేర్చడానికి"
ఒక స్త్రీ శపిస్తోంది
మహా శబ్దంతో ప్రేమిస్తూ-
మాంసపు కోర్కెతో రగిలిపోయే
శాఖాహార స్త్రీ
ఒక్కర్నే ప్రేమించడానికి శక్తులన్నీ
కూడదీసుకుంటూన్నాను
తలపుల్లో ఆ ఒక్కరూ లేనితనాన్నుంచి
ఎట్లా వేరు పడాలి?
స్త్రీ నాలుక భయపెడుతుంది
పెదవులూ, వక్షోజాలూ
నడుమూ
నెల నెలా నిర్దయతో ముడుచుకునే
రహస్యాంగమూ భయపెడుతుంది
ఒక్కర్నే ముట్టుకున్నాను
ఒక్కరితో పిల్లల్ని కంటున్నాను
ఒక్కరిలోనే లోకాన్ని చూస్తున్నాను
దారి లేదు
భయమంటే భయం
ద్వేషమంటే భయం
సౌందర్యపు నిర్లక్ష్యంలో గడ్డి పరకను
చదరపు గదుల్లో
గాలి మేడల్లో
సొంతాస్తుల రిజిస్ట్రేషన్ కాగితాల్లో
ఇరుక్కుపోయాను
కట్టుకున్నాక, కన్నాక...
gud one.
ReplyDeletesaidachaari gaaru
ReplyDeletei read your poems.
happy to meet you here.
bollojubaba